AP CID Searches in Narayana Education Institutions Head Office: హైదరాబాద్లోని నారాయణ విద్యాసంస్థల ప్రధాన కార్యాలయంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు చేశారు. మాదాపూర్‌లోని కార్యాలయంలో 22 మంది సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. దీనిపై సీఐడీ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది.
అప్పటి మంత్రి పి.నారాయణ, MA&UD విభాగం, అప్పటి మరికొందరు మంత్రులు, వారి బినామీలు రాజధాని ప్రాంతంలోని అసైన్డ్ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేశారని.. సీఐడీ వివరించింది. అనంతరం అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. మందడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయునిపాలెం తదితర గ్రామాల్లోని అసైన్డ్ భూములకు ల్యాండ్ పూలింగ్ పథకం ద్వారా లబ్ధి చేకూర్చేందుకు 2016లో జీవో 41 తెచ్చారని పేర్కొంది. పథకం ప్రకారం అప్పటి మంత్రులు బినామీలుగా వ్యవహరించి పేదల అసైన్డ్ భూములను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. నిషేధిత జాబితాలోని భూములపై రిజిస్ట్రేషన్లకు అనుమతించాలని ఒత్తిడి తీసుకొచ్చారని తెలిపారు. ఇందులో పొంగూరు నారాయణ ప్రధాన లబ్ధిదారులుగా గుర్తించినట్లు సీఐడీ వివరించింది.
ఇవీ చదవండి: