AP Budget Session: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల 7 నుంచి ప్రారంభించనున్నారు. మార్చి నెలాఖరు వరకు సమావేశాలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 15 నుంచి 20 పనిదినాలు ఉండేలా సమావేశాలను నిర్వహించవచ్చని అంటున్నారు. మార్చి 7న తొలిరోజు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపట్ల అసెంబ్లీలో సంతాపం తెలియజేయనున్నారు.
8న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తారు. మార్చి 11 లేదా 14న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఏయే రంగాలకు ఈ సారి బడ్జెట్ ఎలా ఉండాలనే విషయమై సీఎం అధికారులకు సూచనలు చేసినట్లు సమాచారం.
ఇదీ చదవండి:
Notices To Theaters: రాష్ట్రంలో థియేటర్లకు ప్రభుత్వం ముందస్తు నోటీసులు