ETV Bharat / state

'పండుగ వేళ రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చింది' - 36 రోజులుగా అంగన్వాడీల సమ్మె - ANDHRA PRADESH

Anganwadi Workers Protest: ఊరూవాడ సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతుంటే జగన్‌ ప్రభుత్వ నిరంకుశ వైఖరితో తామంతా రోడ్డున పడాల్సిన దుస్థితి తలెత్తిందని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలతో కదం తొక్కారు. తమను సంక్రాంతి పండుగ జరుపుకోకుండా చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందంటూ మండిపడ్డారు.

Anganwadi_Workers_Protest
Anganwadi_Workers_Protest
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 16, 2024, 9:19 PM IST

Anganwadi Workers Protest: సీఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ అంగన్వాడీలు 36వ రోజూ ఆందోళనలు కొనసాగించారు. కనుమ పండుగ వేళ వినూత్న నిరసనలతో హోరెత్తించారు. నంద్యాలలో స్థానిక తహసీల్దార్ కార్యాలయ సమీపాన రహదారిపై దీక్షా శిబిరంలో గాలిపటాలతో నిరసన తెలిపారు. ఎస్మా చట్టం రద్దు చేయాలని గాలి పటాలపై రాసి నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసే వరకు సమ్మె విరమించమన్నారు.

ప్రభుత్వ ఎస్మా నోటీసులతో బెదిరించినా వెనక్కి తగ్గేది లేదని కర్నూలులో ఆందోళన చేశారు. పండుగలు లేకుండా రోడ్డుపాలు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని మండిపడ్డారు. ప్రభుత్వం దిగే వచ్చే వరకు సమ్మె ఆపేది లేదంటూ అనంతపురం జిల్లా సింగనమల తహసీల్దార్ కార్యాలయం వద్ద వాలీబాల్ ఆడి నిరసన తెలిపారు. ఎన్ని రోజులైనా సమ్మె చేసి, ప్రభుత్వాన్ని గద్ద దింపుతామని హెచ్చరించారు. తమ డిమాండ్లను వచ్చే ప్రభుత్వంలోనైనా సాధించుకొని విధుల్లోకి హాజరవుతామని తెలిపారు.

అంగన్వాడీల దీక్షా శిబిరానికి నిప్పు - వైసీపీ నాయకులపై అనుమానం

కల్యాణదుర్గం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద జగన్‌, సజ్జల, బొత్స ఫొటోలు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. అనంతపురం కలెక్టరేట్‌ వద్ద అంగన్వాడీల దీక్ష శిబిరానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. తమను బెదిరించడానికి వైసీపీ నేతలు, ప్రభుత్వమే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతోందని అంగన్వాడీలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి చర్చలు ఎన్ని చేసినా తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు.

అనంతరం మట్టి తింటూ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మహిళలను పండగ పూట రోడ్డుపైన మట్టి తినేలా చేశారని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చిన జగన్​కు 36 రోజులుగా మహిళలు రోడ్డుపై ఆందోళనలు చేస్తున్నా కనబడలేదా, వినపడలేదా అంటూ ప్రశ్నించారు.

పండగకు దూరమైన అక్కచెల్లెమ్మలు - కొనసాగుతున్న అంగన్​వాడీల ఆందోళన

కనీస వేతనంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని నెల్లూరు కలెక్టరేట్‌ వద్ద అంగన్వాడీలు ఆందోళన చేశారు. ఒంగోలు కలెక్టరేట్‌ ఎదుట కోటి సంతకాల సేకరణ చేపట్టారు. దీక్షా శిబిరం వద్ద పిండి వంటలు చేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం దిగి రాకుంటే తాడేపల్లి ప్యాలెస్‌ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో సమ్మెకు ప్రజల మద్దతు కూడగడుతూ సంతకాల సేకరణ చేపట్టారు.

విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీల ఆందోళనకు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడవరంలో సీఎం జగన్‌, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి చిత్రాల పటాల ముందు పిండివంటలు ఉంచి, అంగన్వాడీలు కారం అన్నం తింటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రభుత్వ తాటకు చప్పుళ్లకు వెనక్కి తగ్గేదే లేదు : అంగన్వాడీలు

'పండుగ వేళ రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చింది' - 36 రోజులుగా అంగన్వాడీల సమ్మె

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.