Andhra Pradesh Youth Tortured in America: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడిని ఇంట్లో బంధించి, కొట్టి, చిత్రహింసలు పెట్టిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. బంగారు భవిష్యత్తు అంటూ ఆశ చూపి.. అమెరికా రప్పించి.. తీరా అక్కడకు వచ్చిన తరువాత బాత్రూమ్కి కూడా వెళ్లనీయకుండా అత్యంత పాశవికంగా ప్రవర్తించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూఎస్‌లో బందీగా ఉన్న ఏపీ విద్యార్థిని మిస్సౌరీలోని అధికారులు రక్షించారు. ఏడు నెలలుగా యువకుడిని విచక్షణారహితంగా చిత్రహింసలకు గురిచేసి.. ఇళ్లలో పని చేయించుకున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సత్తారు వెంకటేష్ రెడ్డి అనే వ్యక్తి ఏపీకి చెందిన ఓ యువకుడి(20)కి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. అమెరికా రప్పించాడు. అనంతరం అతడు.. తన బంధువులతో కలిసి ఆ యువకుడిని.. తన ఇంటి బేస్మెంట్లో బంధించాడు. బాత్రూంకు వెళ్లేందుకు కూడా అనుమతించకుండా.. యువకుడిని కొట్టి చిత్రహింసలకు గురి చేశారు.
ఇది గమనించిన ఓ వ్యక్తి.. అమెరికా పోలీసులకు కాల్ చేసి సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు యువకుడిని వారి నుంచి విడిపించారు. ఈ ఘటనలో సత్తారు వెంకటేష్ రెడ్డి, శ్రావణ్ వర్మ పెన్మత్స, నిఖిల్ వర్మ పెన్మత్స అనే ముగ్గురు నిందితులపై హ్యూమన్ ట్రాఫికింగ్, కిడ్నాపింగ్ కేసులు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు.
YCP Leaders Attack on TDP Workers : ఆదోనిలో రెచ్చిపోతున్న వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తల దాడి
విచక్షణారహిత దాడి - విరిగిన ఎముకులు: పీవీసీ చెక్క బోర్డులు, మెటల్ రాడ్‌లు, కర్రలతో.. నిందితులు విచక్షణా రహితంగా కొట్టడంతో బాధిత యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో విరిగిన ఎముకలు, కమిలిన గాయాలతో యువకుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
లోకేశ్ ట్వీట్: ఈ దారుణమైన ఘటనపై తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. సైకో జగన్ ఆంధ్రప్రదేశ్ జనం రక్తం పీల్చుతుంటే, ఆయన అనుచర పిల్ల సైకోలు అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతపై శాడిజం చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీకి చెందిన 20 ఏళ్ల యువకుడికి బంగారు భవిష్యత్తు అంటూ ఆశ చూపించి అమెరికా రప్పించి, అక్కడ కూడా తమ అధినేత జగన్ లాగే.. వైసీపీ నేత సత్తారు వెంకటేష్ రెడ్డి సైకోయిజం చూపించాడని మండిపడ్డారు.
ఆ యువకుడిని తన ఇంట్లో బంధించి, కొట్టి, చిత్రహింసలు పాల్చేశారని అన్నారు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగి ఉంటే.. వైసీపీ ప్రభుత్వం.. బాధిత యువకుడిపైనే రివర్స్ కేసు పెట్టి.. సీఐడీతో దర్యాప్తు చేయించేవారని పేర్కొన్నారు. అయితే అమెరికా ప్రభుత్వం ముందు వైసీపీ సైకోల ఆటలు సాగలేదన్న లోకేశ్.. చట్టానికి పిల్ల సైకోలు చిక్కారని (Nara Lokesh Tweet ) ట్వీట్ చేశారు.
-
సైకో జగన్ ఆంధ్రప్రదేశ్ జనం రక్తం పీల్చుతుంటే, ఆయన అనుచర పిల్ల సైకోలు అమెరికాలో ఏపీ యువతపై శాడిజం చూపిస్తున్నారు. ఏపీకి చెందిన 20 ఏళ్ల కుర్రాడికి బంగారు భవిష్యత్తు ఆశ చూపించి అమెరికా రప్పించి, అక్కడ కూడా తమ అధినేత జగన్ లాగే సైకోయిజం చూపించాడు వైసీపీ నేత సత్తారు… pic.twitter.com/PCcWmwHENc
— Lokesh Nara (@naralokesh) December 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">సైకో జగన్ ఆంధ్రప్రదేశ్ జనం రక్తం పీల్చుతుంటే, ఆయన అనుచర పిల్ల సైకోలు అమెరికాలో ఏపీ యువతపై శాడిజం చూపిస్తున్నారు. ఏపీకి చెందిన 20 ఏళ్ల కుర్రాడికి బంగారు భవిష్యత్తు ఆశ చూపించి అమెరికా రప్పించి, అక్కడ కూడా తమ అధినేత జగన్ లాగే సైకోయిజం చూపించాడు వైసీపీ నేత సత్తారు… pic.twitter.com/PCcWmwHENc
— Lokesh Nara (@naralokesh) December 1, 2023సైకో జగన్ ఆంధ్రప్రదేశ్ జనం రక్తం పీల్చుతుంటే, ఆయన అనుచర పిల్ల సైకోలు అమెరికాలో ఏపీ యువతపై శాడిజం చూపిస్తున్నారు. ఏపీకి చెందిన 20 ఏళ్ల కుర్రాడికి బంగారు భవిష్యత్తు ఆశ చూపించి అమెరికా రప్పించి, అక్కడ కూడా తమ అధినేత జగన్ లాగే సైకోయిజం చూపించాడు వైసీపీ నేత సత్తారు… pic.twitter.com/PCcWmwHENc
— Lokesh Nara (@naralokesh) December 1, 2023
రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు - ప్రశ్నించాడని టీడీపీ కార్యకర్తపై కర్రలతో దాడి