రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయుని పాలెం వద్ద మహిళలు వినూత్నంగా సంకెళ్లతో చేతులు కట్టుకొని నిరసన తెలియజేశారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న తమకు ప్రభుత్వం సంకెళ్లు విధించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెట్టి తమను మానసిక క్షోభకు గురిచేస్తోందని వాపోయారు.
ప్రశ్నిస్తే కేసులు, కొట్టడం, చంపడాలు ఇవే రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్నాయని రాజధాని మహిళలు ఆరోపించారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు.
ఇదీ చదవండి: