కృష్ణా నది కరకట్ట వెంట ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని అమరావతి రైతులు డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఫిర్యాదు చేసేందుకు.. గుంటూరు కలెక్టరేట్‌కు వెళ్లారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవటంతో కార్యాలయ సిబ్బందికి ఫిర్యాదు పత్రం అందజేశారు. కృష్ణా నదిలో డ్రెడ్జింగ్, రాజధాని భూముల్లో ఇసుక డంపింగ్‌పై అభ్యంతరం తెలిపిన రైతులు.. దీనివల్ల కరకట్ట బలహీనపడే ప్రమాదముందని ఆందోళన వెలిబుచ్చారు. అనుమతులు లేకుండా ఇసుక డంపింగ్ చేస్తున్న ప్రైవేటు సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కేంద్రానికి నివేదిక ఇస్తాం..
అమరావతి రాజధానిలో అక్రమ ఇసుక తవ్వకాలపై కేంద్రానికి నివేదిక ఇస్తామని భాజపా ప్రతినిధుల బృందం తెలిపింది. కృష్ణా నదిలో డ్రెడ్జింగ్ జరుగుతున్న ప్రదేశాన్ని, గుంటూరు జిల్లా మందడం పొలాల్లో.. అక్రమంగా ఇసుక నిల్వ చేసే ప్రాంతాన్ని రైతులతో కలిసి భాజపా నేతలు పరిశీలించారు. తాము ఇసుక తవ్వడానికి అనుకూలమేనని.. అయితే దానిని తీసే విధానం సక్రమంగా లేదన్నారు.
ఇదీ చదవండి