గుంటూరు అర్బన్ ఎస్పీగా అమ్మిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన రామకృష్ణ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో డైరెక్టర్ గా బదిలీ అయ్యారు. ఎస్పీ అమ్మిరెడ్డిని పోలీసు అధికారులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందించారు. గతంలో ఆయన ఇక్కడ విజిలెన్స్ ఎస్పీగా పనిచేశారు. గుంటూరు జిల్లాపై అవగాహన ఉందని.. శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని అమ్మిరెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: కాళ్లావేళ్లా పడితే వైకాపాలో చేరా.. నాకు నేను వెళ్లలేదు: రఘురామకృష్ణరాజు