ETV Bharat / state

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా మృతదేహానికి అంత్యక్రియలు

అనంతపురంలో కొవిడ్ కారణంగా మృతి చెందిన వ్యక్తి మృతదేహానికి గుంటూరు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు దహన సంస్కారాలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. అనంతపురంలో అంత్యక్రియలు చేయటానికి వీలు లేకుండాపోవటంతో గుంటూరుకు తరలించి అంతిమ కార్యక్రమాలు నిర్వహించారు.

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా మృతదేహానికి అంత్యక్రియలు
అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా మృతదేహానికి అంత్యక్రియలు
author img

By

Published : Sep 18, 2020, 10:26 PM IST

కొవిడ్ కారణంగా మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మానవత్వం చాటుకున్నారు. అనంతపురానికి చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందారు. అంత్యక్రియలు నిమిత్తం అనంతపురంలోని తమ నివాసానికి మృతదేహాన్ని తీసుకెళ్తే అక్కడ అంత్యక్రియలు చేయడానికి వెసులుబాటు లేకుండాపోయింది. పొన్నూరులోని బంధువులకు మృతుని కుటుంబ సభ్యులు ఫోన్ చేసి విషయం చెప్పగా... గుంటూరులో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వివరాలు ఇచ్చారు. వారిని సంప్రదించగా దహన సంస్కారాలు చేయడానికి సరేనన్నారు. అనంతపురం నుంచి అంబులెన్స్​లో మృతదేహాన్ని గుంటూరు తీసుకువచ్చి దహన సంస్కరాలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు జ్ఞాన ప్రసన్న బాబు తదితరులు పాల్గొన్నారు.

ఇదీచదవండి

మరో ఆలయంపై దాడి... సీతారామాంజనేయుల విగ్రహాలు ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.