ETV Bharat / state

Amaravathi SC JAC Protest: "ఎమ్మెల్యే పదవికి.. ఉండవల్లి శ్రీదేవి రాజీనామా చేయాలి"

Amaravathi SC JAC Protest: గౌరవప్రదమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే శ్రీదేవి.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​పై అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని ఖండిస్తున్నామని అమరావతి ఎస్సీ ఐకాస నేతలు అన్నారు. ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత శ్రీదేవికి లేదని.., తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి

author img

By

Published : Dec 31, 2021, 8:07 PM IST

Amaravathi SC JAC Protest Against Mla Sridevi: అంబేడ్కర్​పై అనుచిత వ్యాఖ్యలు చేసిన గుంటూరు జిల్లా తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి తన పదవికి రాజీనామా చేయాలంటూ అమరావతి ఎస్సీ ఐకాస నేతలు డిమాండ్ చేశారు. శ్రీదేవి తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలంటూ తుళ్లూరు అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ఎస్సీ ఐకాస నేతలు అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గౌరవప్రదమైన పదవిలో ఉండి.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​పై వ్యాఖ్యలు చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు.

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​పై ఎమ్మెల్యే శ్రీదేవి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని గుంటూరు జిల్లా మర్రిచెట్టు పాలెం దళిత సంఘాల నాయకులు వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలకు నిరసనగా.. నార్కట్ పల్లి - అద్దంకి హైవేపై ఆందోళనకు దిగారు. శ్రీదేవి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

వివాదం ఏంటంటే..?
ఇటీవల రాజమహేంద్రవరంలో నిర్వహించిన ప్రపంచ 4వ మాదిగ మహాసభలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.."రాజ్యంగం రచించిన అంబేడ్కర్ అందరికీ తెలుసు. కానీ రాజ్యంగం పార్లమెంట్​లో అమలయ్యేందుకు బాబు జగ్జీవన్​రాం కృషి చేశారు. స్వాతంత్య్ర సమరంలో ఆయన పోరాటం చేశారు. మనం బాబు జగ్జీవన్​రాంను ఆదర్శంగా తీసుకోవాలి." అని వ్యాఖ్యనించారు. ఈ వ్యాఖ్యలు శ్రీదేవికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

నేను అలా అనలేదు: శ్రీదేవి
MLA Sridevi: డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్​ను తాను అవమానపరచేలా మాట్లాడలేదని.. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. మాదిగ మహాసభలో తాను చేసిన ప్రసంగాన్ని ఎడిటింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తన ప్రసంగంలో తెలియక తప్పులు దొర్లి ఉంటే అంబేడ్కర్​ వాదులు, దళిత బహుజనులు క్షమించాలని కోరారు. తాను ఉద్దేశ్యపూర్వకంగా అంబేడ్కర్​పై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలూ చేయలేదని వివరణ ఇచ్చారు.

ఇదీ చదవండి :

MLA Sridevi: నేను అలా అనలేదు.. ఆ వీడియో ఎడిటింగ్ చేశారు: ఎమ్మెల్యే శ్రీదేవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.