ETV Bharat / state

సడలని సంకల్పం.. 555వ రోజు అమరావతి నిరసనలు

ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ.. అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న నిరసన 555వ రోజుకు చేరింది. రాజధానిలో నిర్మించిన భవనాలను త్వరతిగతిన పూర్తి చేయాలంటూ తుళ్లూరు రైతులు, మహిళలు ఆందోళన చేశారు.

amaravathi protest reached to 555 day
amaravathi protest reached to 555 day
author img

By

Published : Jun 24, 2021, 4:17 PM IST

వైకాపా ప్రభుత్వం తలకిందుల తపస్సు చేసినా రాజధానిని ఈ ప్రాంతం నుంచి తరలించలేరని అమరావతి ఉద్యమ ఐకాస కన్వీనర్ శివారెడ్డి చెప్పారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు 555వ రోజు నిరసనలు చేశారు. మొన్నటివరకు.. కరోనా నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన ఉద్యమం క్రమంగా శిబిరాల్లోకి చేరుకుంటోంది.

తాజాగా.. ఉద్ధండరాయునిపాలెంలో పుననిర్మించిన శిబిరాన్ని గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం తెదేపా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, ఐకాస కన్వీనర్ శివారెడ్డి ప్రారంభించారు. బుద్ధుడి విగ్రహానికి పూలమాలల వేసి.. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. రాజధానిలో నిర్మించిన భవనాలను త్వరతిగతిన పూర్తి చేయాలంటూ తుళ్లూరు రైతులు, మహిళలు ఆందోళన చేశారు.

ఇదీ చదవండి:

పరీక్షల సమయంలో మూడో వేవ్ వస్తే.. ఏం చేస్తారు?: సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.