రాజధానిపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణాయపాలెంలో రైతులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. వెలగపూడి, ఉద్దండరాయునిపాలెంలోనూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధాని కోసం కొడాలి నాని ఒక ఎకరం అయినా ఇచ్చారా అని రైతులు ప్రశ్నించారు. తమ భవిష్యత్తును ఫణంగా పెట్టి రాజధాని కోసం ఉన్న పొలాన్ని మొత్తం ఇచ్చామన్నారు. న్యాయస్థానాల్లో ఉన్న అంశంపై మంత్రి ఎలా వ్యాఖ్యానిస్తారని రైతులు ప్రశ్నించారు. మంత్రి కొడాలి నాని ఇప్పటికైనా తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
తామంతా రాజధాని కోసం భూములు ఇచ్చామని... పేదల కోసం కాదని స్పష్టం చేశారు. అమరావతిలోని 29 గ్రామాల్లో ముందు పేదల కోసం కట్టించిన ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటికీ ఇంకా పేదలు ఉంటే వాళ్లకు భూములు మంజూరు చేయాలని కోరారు. తాము రాజధానికి భూములు ఇచ్చామని... ఇతర జిల్లాల పేదల కోసం కాదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని సీఎంకు చెప్పా'