ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు... ఏప్రిల్ 30వ తేదీ నుంచి దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డులో కొనుగోళ్లు ప్రారంభించామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు మార్కెట్ పరిశీలించిన ఆయన... ఇప్పటి వరకు 6,200 క్వింటాళ్ల విక్రయాలు జరిగాయన్నారు. మరో 13 వందల మంది రైతులు పంట ఉత్పత్తులు వెబ్సైట్లో నమోదు చేసుకున్నారని వెల్లడించారు. మరో నెల పాటు పసుపు కొనుగోళ్లకు అవకాశం కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేశారని... మార్క్ఫెడ్ అధికారులతో చర్చించి అవకాశం కల్పిస్తామని హామీఇచ్చారు.
పసుపు మార్కెట్ యార్డును సందర్శించిన ఎమ్మెల్యే ఆళ్ల - పసుపు మార్కెట్ యార్డును సందర్శించిన ఎమ్మెల్యే ఆళ్ల
గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డును ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సందర్శించారు. ఇప్పటి వరకు మార్కెట్లో 6,200 క్వింటాళ్ల విక్రయాలు జరిగాయని వివరించారు.