వైద్య రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వ్యాఖ్యనించారు. ఉపసభాపతి కోన రఘుపతితో కలిసి ఆయన గుంటూరు జిల్లా బాపట్లలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కళాశాల స్థలాన్ని పరిశీలించారు.
వైద్యరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రాష్ట్రంలో అదనపు మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో మరో 15 మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.