అధికార అహంతో విచ్చలవిడిగా ప్రవర్తించటం వైకాపా నేతలకు సరికాదని మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు. గుంటూరు జిల్లా ఉంగుటూరు గ్రామ సర్పంచ్ భర్త సోమశేఖర్పై దాడికి పాల్పడిన రాయపాటి శివపై రౌడీషీట్ తెరిచి తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గత రెండు నెలల్లో ఆరు సార్లు సోమశేఖర్పై దాడి జరిగినా..పోలీసులెందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా చేసే వారిని ఆపటం సిగ్గుచేటని మండిపడ్డారు. హోంమంత్రి సొంత జిల్లాలోనే ఇలాంటి దాడులు జరుగుతున్నా పట్టించుకోకపోవటం హేయమైన చర్యని దుయ్యబట్టారు.
ఇదీచదవండి