స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను పక్కన పెట్టుకుని పేదలకు ఆర్థిక సాయం చేయటం రాజకీయం కాక మరేంటని తెదేపా సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్.. వైకాపా నేతల్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా విజృంభణ, రైతుల సమస్యలు, ప్రభుత్వ ఉదాసీనతపై ఆయన ఓ వీడియో విడుదల చేశారు. వాలంటీర్లతో పాటు అధికార పార్టీ నేతలు, అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మరే సమస్యలూ లేవన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని... అలాగే నిమ్మ, అరటితో పాటు ఇతర ఉద్యాన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఆక్వా రంగాన్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి మాటలు చెబుతున్నారే తప్ప చేతల్లో చూపటం లేదని విమర్శించారు.
ఇదీ చదవండి: