ఇసుక సమస్యను పరిష్కరించాలంటూ గుంటూరులో భవన నిర్మాణకార్మికులు ఆందోళన చేశారు. గుంటూరు శంకర్ విలాస్ కూడలి నుంచి లేబర్ కమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్మికులకు మద్దతు తెలుపుతూ కార్మికసంఘాలు నిరసనలో పాల్గొన్నారు. ఇసుక సరఫరా విధానంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వలన భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారని ఏఐటీయూసీ నేతలు ఆరోపించారు. కార్మికులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోల్పోయిన కార్మికులకు తక్షణమే 20 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'ఇసుగించొద్దు... పని కల్పించండి...' - aituc latest news in guntur
ఇసుక సమస్యను పరిష్కరించాలంటూ భవన నిర్మాణ కార్మికుల ఆందోళన చేపట్టారు. కార్మికులకు ఏఐటీయూసీ నేతలు మద్దతు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే కార్మికులు రోడ్డునపడ్డారని ఆరోపించారు. తక్షణమే 20 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.