అగ్రి గోల్డ్ బాధితులు మళ్లీ ఉద్యమ బాట పట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని గుంటూరులో విజ్ఞాపన దీక్ష ప్రారంభించారు. అగ్రిగోల్డ్ బాధితుల విజ్ఞాపన దీక్షలను... ఆ సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రారంభించారు. భౌతికదూరం పాటిస్తూ బాధితులు విజ్ఞాపన దీక్షలు చేస్తున్నారు. బడ్జెట్‌లో కేటాయించిన 11 వందల 50 కోట్ల రూపాయలు సత్వరమే చెల్లించాలని వారు కోరుతున్నారు. మొత్తం సొమ్ములో 50 శాతాన్ని తక్షణం చెలించాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యను ఆరుసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, సీఎంను కలిసేందుకు నాలుగుసార్లు ప్రయత్నించామని ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. మూడు నెలల్లోనే తన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం... కొందరికి మాత్రమే చెల్లింపులు చేశారని బాధితులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: