మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పొలాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ అధికారులు పరిశీలించారు. ఫిరంగిపురం మండలం వేమవరంలో సాగు చేస్తున్న తన పొలంలో పంట పాడైందని ఆయన వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అధికారులు పంటను పరిశీలించారు. గింజలు లేని కంకులను ఆర్కే వారికి చూపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ సుమలత మాట్లాడుతూ.. మంగళగిరి శాసనసభ్యులు ఆర్కే ఏపీ సీడ్స్ ద్వారా బీపీటీ 5204 వరి విత్తనాలు 5 సంచులు కొనుగోలు చేశారన్నారు. వాటిలో 3 సంచుల్లో కల్తీ విత్తనాలు కనుగొన్నట్లు చెప్పారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవీ చదవండి..