ETV Bharat / state

జూబ్లీహిల్స్‌లో జనసేన కార్యకర్తల ఆందోళన.. ఆ పబ్‌ను మూసివేయాలని డిమాండ్‌

jana sena activists in Jubilee Hills: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జనసేన కార్యకర్తల ఆందోళనకు దిగారు. పవన్ కల్యాణ్ ఇంటికి సమీపంలోని రోడ్ నంబర్-36లోని తబ్లా రస పబ్‌ను మూసివేయాలని డిమాండ్‌ చేస్తూ వారు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

janasena activists
janasena activists
author img

By

Published : Nov 4, 2022, 10:03 PM IST

jana sena activists in Jubilee Hills

jana sena activists: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోడ్ నంబర్-36లోని తబ్లా రస పబ్‌ను మూసివేయాలని డిమాండ్‌ చేస్తూ.. పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. పవన్‌ కల్యాణ్ ఇంటికి సమీపంలోనే ఉన్న ఈ పబ్‌ ముందు ఆందోళన నిర్వహించారు. నివాస ప్రాంతాల మధ్య పబ్‌లు ఉండొద్దని.. వెంటనే తరలించాలని జనసేన నేతలు డిమాండ్‌ చేశారు.

జనసైనికులు భారీగా వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ముందుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పవన్ ఇంటికి వెళ్లే మార్గంలో చెక్‌పోస్టు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు-జనసైనికులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు. నివాస ప్రాంతాల మధ్య ఉన్న తబ్లా పబ్​ను వెంటనే మార్చకపోతే.. తమ ఆందోళన ఉధృతం చేస్తామని జనసేన కార్యకర్తలు హెచ్చరించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.