ETV Bharat / state

కారు చీకట్లు..జోరు వాన.. భయంతో ఉన్న ఆ యువతి ఇంటికి చేరిందా? - గుత్తికొండ బిలం

తనతో పాటు వచ్చిన బంధువులు ఆటోలో వెళ్లిపోయారు.. తనకు స్కూటీ ఉండడం, వర్షం కురుస్తుండడంతో కొంతసేపటి తర్వాత వెళ్లొచ్చులే అని ఎదురు చూసింది ఆ యువతి. కానీ ఆ తర్వాతే అసలు సమస్య తలెత్తింది. వర్షం వలన బురదమయమైన రహదారి, స్కూటీపై ముందుకు వెళ్లలేని పరిస్థితి. మెల్లగా చీకటి పడుతోంది. చుట్టు దట్టమైన అటవీ ప్రాంతం ఎం చేయాలో తెలియని స్థితిలో వచ్చిన ఆలోచన ఆమెను సమస్య నుంచి గట్టెక్కించిందా..? లేదా? అయితే ఇది చదవండి

యువతి
యువతి
author img

By

Published : Aug 29, 2021, 12:13 PM IST

గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ఓ యువతి బంధువులతో కలిసి గుత్తికొండ బిలం సందర్శనకు వెళ్లింది. దర్శనం అనంతరం బంధువులు ఆటోలో వెళ్లిపోయారు. తనకు స్కూటీ ఉండడం, వర్షం కురుస్తుండడంతో కొంతసేపటి తర్వాత వెళ్లవచ్చిని ఎదురు చూసింది. వర్షం తగ్గిన తర్వాత వెళ్లాదామని స్కూటీ తీసింది. కానీ అప్పటికే రోడ్డు బురదమయమైంది. స్కూటీ వెళ్లేందుకు అనువుగా లేదు. పైగా చీకటి పడుతోంది. అటవీ ప్రాంతం కావడంతో ఆమె ఆందోళనకు గురైంది. ఏం చేయాలో అర్థం కాలేదు. చేతిలో సెల్​ఫోన్​... అందులో దిశా యాప్​ గుర్తొచ్చింది. క్షణం ఆలస్యం చేయకుండా యాప్​ బటన్​ నొక్కింది. అంతే దిశా కాల్​పై వెంటనే పోలీసులు స్పందించారు. అక్కడికి చేరుకుని ఆమెను ఇంటికి దగ్గర క్షేమంగా దింపారు.

దిశా యాప్ ద్వారా తనను రక్షించిన పిడుగురాళ్ల పట్టణ సీఐ ప్రభాకర్​కు, ఎస్సై చరణ్​కు, గుత్తికొండ మహిళ పోలీస్​లకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ప్రతి ఒక్కరు దిశా యాప్ ​డౌన్​లోడ్ చేసుకోవాలని, ఆపదలో ఉన్న వారికి యాప్ అండగా ఉంటుందని తెలిపింది.

ఇదీ చదవండి: దారి తప్పిన భర్త.. బుద్ధి చెప్పిన భార్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.