గుంటూరులో గనులు - భూగర్భ శాఖ అధికారి వీరాస్వామి లంచం తీసుకుంటుంగా అనిశా అధికారులకు పట్టుబడ్డారు. కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన విజయ సాగర్ అనే వ్యక్తి తనకు ఉన్న పట్టా భూమిలో ఇసుక తవ్వుకునేందుకు అనుమతి కోరగా.. ఒంగోలులో ప్రాంతీయ విజిలెన్స్ స్క్వాడ్‌లో అసిస్టెంట్ జియలజిస్ట్గా పనిచేస్తున్న వీరాస్వామి రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేశారు.
బాధితుడు విజయ్ సాగర్ అనిశా అధికారాలను సంప్రదించారు. గుంటూరు చంద్రమౌళి నగర్ ఎస్బీఐ ఏటీఎం వద్ద 2 లక్షల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వీరాస్వామిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వద్ద నుంచి నగదు, సంబంధిత రికార్డులను అనిశా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విజయవాడ అనిశా స్పెషల్ కోర్టులో హాజరుపరుస్తామని అధికారాలు తెలిపారు.
ఇదీ చదవండి తెనాలిలో రూపుదిద్దుకుంటున్న మాజీప్రధాని పీవీ కాంస్య విగ్రహం