ETV Bharat / state

Achchennaidu on YCP Attacks on SC, ST and BCs: ఎస్సీ, ఎస్టీ, బీసీలపై ఇంత ఊచకోత ఎప్పుడైనా చూశామా..?: అచ్చెన్నాయుడు - YCP leaders Irregularities

Achchennaidu on YCP Attacks on SC, ST and BCs: రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం బడుగులను ఊచ కోత కోసి వారి హక్కుల్ని కాలరాసి బస్సుయాత్ర చేపట్టిందని తెలుగుదేశం నేత అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో ముఖ్య నేతలు సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. పేదల గొంతు కోస్తున్న పెత్తందారు జగన్ రెడ్డి పేరుతో కరపత్రం విడుదల చేశారు.

achchennaidu_on_ycp
achchennaidu_on_ycp
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 26, 2023, 1:44 PM IST

Achchennaidu on YCP Attacks on SC, ST and BCs: బడుగు బలహీన వర్గాల అభివృద్ధిపై అధికార పార్టీ నాయకులు ఇన్నాళ్లూ గాఢ నిద్రలో ఉండి.. మళ్లీ మోసం చేసేందుకు బస్సు యాత్ర అంటున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పేదల గొంతు కోస్తున్న పెత్తందారు జగన్ రెడ్డి పేరుతో తెలుగుదేశం కరపత్రం విడుదల చేసింది. ఎన్టీఆర్ భవన్​లో వివిధ వర్గాలపై వైసీపీ చేసిన దాడులకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్​ను అచ్చెన్నాయుడు, ముఖ్య నేతలు తిలకించారు. బడుగులను ఊచ కోత కోసి, హక్కులను జగన్ ప్రభుత్వం కాలరాసిందని విమర్శించారు. దారి మళ్లించిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల గురించి సమాధానం చెప్పి వైసీపీ బస్సు యాత్ర చేపట్టాలని హితవు పలికారు. నిధుల్లేని.. ఆర్థిక సాయం అందించలేని కార్పోషన్లను ఏర్పాటు చేసి బీసీ కులాలను మోసం చేశారని ఆక్షేపించారు. బీసీలకు అన్యాయం జరుగుతోంటే నోరు తెరిచి మాట్లాడలేని బీసీలకు మంత్రి పదవి ఇచ్చారని ధ్వజమెత్తారు. పవర్​ లేని పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇస్తే లాభమేముందని ప్రశ్నించారు.

Achchennaidu on YCP Attacks on SC, ST and BC: జగన్‌ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఊచ కోత కోసింది: అచ్చెన్నాయుడు

KVPS General Secretary Exclusive Interview 2023 : 'సామాజిక న్యాయం పేరుతో బస్సు యాత్ర చేసే అర్హత వైసీపీకి ఉందా?'

బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను జగన్ మోసం చేస్తున్నాడని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. పెత్తందారు జగన్.. పేదల గొంతు కోసే పాలన చేస్తూ అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం ఎస్టీలవి 29 పథకాలు, మైనారిటీలవి 11 పథకాలు రద్దు చేశారని మండిపడ్డారు. ఇన్నేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలపై ఇంత ఊచకోత.. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, అక్రమాలు ఎప్పుడైనా చూశామా? అంటూ మండిపడ్డారు. ఇన్ని అరాచకాలపై జగన్‌ను ఏ మంత్రికి అయినా ప్రశ్నించే ధైర్యం ఉందా అని అన్నారు. రాష్ట్రాన్ని సొంత కుటుంబసభ్యులు నలుగురికి ధారాదత్తం చేశారని ఆగ్రహించారు. ఉత్తరాంధ్రకు సొంత చిన్నాన్న సుబ్బారెడ్డిని సామంతరాజుగా నియమించారని అన్నారు.

TDP Leaders meet the Governor: వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది.. గవర్నర్​కు టీడీపీ ఫిర్యాదు

రాష్ట్రంలో దళితులను, బీసీలను వైసీపీ నేతలే ఊచ కోతలు కోస్తున్నారన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని తెలుగుదేశం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో వైసీపీ పట్ల విముఖత పెరగడం వల్లే వైసీపీ నేతలు బస్సు యాత్ర పెట్టారని తెలుగుదేశం సీనియర్‌ నేతలు మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో ముఖ్య నేతలు సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. వైసీపీ సామాజిక సాధికారత బస్సు యాత్రపై నేతలు ధ్వజమెత్తారు.

TDP Leaders fire On Police Behaviour: రోజంతా కొల్లు రవీంద్రను నిర్బంధించి.. వేధింపులకు గురి చేసిన పోలీసులు.. బైఠాయించిన టీడీపీ శ్రేణులు

డ్రైవర్ సుబ్రమణ్యాన్ని హత్య చేసిన అనంతబాబు ఘటనపై ఎస్సీల్లో చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహించాలని నేతలు సూచించారు. రేపల్లెలో పదో తరగతి చదివే బీసీ విద్యార్థి దహనం చేసిన ఘటనకు వైసీపీ సమాధానం చెప్పేలా బస్సు యాత్రకు వచ్చే వైసీపీ నేతలపై ఒత్తిడి తేవాలని నేతలు స్పష్టం చేశారు. నంద్యాలలో మైనార్టీ వ్యక్తి సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనను వైసీపీకు గుర్తు చేయాలని నేతలు అభిప్రాయపడ్డారు. వివిధ వర్గాలపై దాడులు.. వైఖరిపై అధికార పార్టీ ని నిలదీసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని తెలుగుదేశం భావిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.