అతివేగం రెండు నిండు ప్రాణాలను బలిగొంది.హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో వస్తుండగా... ట్రాక్టర్ వెనక నుంచి ఢీ కొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుడిని హైదరాబాదులోని యశోద హాస్పిటల్ కు తరలించారు. వీరు ముగ్గురు గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన వారే. మృతులలో ఒక్కరు కోళ్ల పూడి ధనలక్ష్మిగా కాగా... మరొక వ్యక్తి నర్రా యశ్వంత్. గాయపడిన వ్యక్తి పెండ్యాల సాయి సందీప్ గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారి బంధువులకు అప్పగించారు.
సూర్యాపేట వద్ద రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి - accidnet in suryapeta
లాక్ డౌన్ సడలింపులతో సొంత రాష్ట్రానికి చేరుకోవాలన్న వారి కల మధ్యలోనే ఆవిరైంది. కోటి ఆశలో హైదరాబాదు నుంచి గుంటూరుకు బయులుదేరిన వీరిని మృత్యవు కబళించింది. సూర్యాపేట సమీపంలో వెనుక నుంచి వస్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడిక్కడే చనిపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.