గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి కోనాయికుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం రాజుపాలెం గ్రానైట్లో పనిచేస్తున్న తమిళనాడుకు చెందిన యువకుడు రవితేజ.. అదే గ్రామానికి చెందిన మరో యువకుడు గట్టుపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి ద్విచక్రవాహనంపై చిలకలూరిపేటకు వస్తున్నారు. వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ బైక్ను ఢీకొట్టి.. ఆగకుండానే వెళ్లిపోయింది. ప్రమాదంలో రవితేజ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లుకు చిలకలూరిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.. చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి.