ఇదీ చూడండి:
తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో అనిశా తనిఖీలు - తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో నిధుల స్వాహా
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో రెండో రోజూ అనిశా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో భాగంగా గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలోనూ సోదాలు జరిగాయి. అంబులెన్స్ రాకపోకల ఖర్చుల పేరుతో ఆస్పత్రి అధికారులు రూ.4 లక్షలు స్వాహా చేసినట్లు అనిశా అధికారులు గుర్తించారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన 3 వేల మందికి రెండేళ్లుగా చెల్లింపులు నిలిపివేశారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాల నుంచి శిక్షణ తీసుకున్నట్లు నకిలీ ధ్రువపత్రాల సృష్టించి.. అక్రమాలకు పాల్పడిన వారిపై అనిశా ఏఎస్పీ సురేశ్‌బాబు విచారణ జరుపుతున్నారు.
తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో అనిశా తనిఖీలు
ఇదీ చూడండి:
TAGGED:
Gnt Akramaallu