ETV Bharat / state

ACB: ఏసీబీ వలలో మున్సిపల్ ఉద్యోగి.. లంచం తీసుకుంటుండగా.. - నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం

గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్​గా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు నిఘా ఉంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.

ACB
ఏసీబీ వలలో మున్సిపల్ ఉద్యోగి
author img

By

Published : Nov 9, 2021, 5:15 PM IST

Updated : Nov 9, 2021, 7:32 PM IST

గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం వడ్లమూడివారిపాలెేనికి చెందిన వడ్లమూడి శివరామయ్య అనే కాంట్రాక్టర్ రెండేళ్ల క్రితం నరసరావుపేట పట్టణ పరిధిలో మున్సిపాలిటీ కింద రెండు సీసీ రోడ్లు నిర్మాణం పనులు చేశాడు. అయితే శివరామయ్య మున్సిపల్ కార్యాలయం నుంచి రావాల్సిన నిధుల కోసం సీనియర్ అసిస్టెంట్ మధును సంప్రదించాడు. బిల్లు సొమ్ము విడుదల చేసేందుకు ఆ అధికారి రూ. 8 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ వడ్లమూడి శివరామయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు.. ఆ అధికారి కాంట్రాక్టర్ నుంచి రూ. 3 వేలు లంచం తీసుకుంటుంటే పట్టుకున్నట్లు గుంటూరు ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ వెల్లడించారు.

అనంతపురం జిల్లాలో..

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అవినీతి ఆరోపణల ఫిర్యాదు అందడంతో జిల్లా రిజిస్టర్ అధికారిని ఉమా మహేశ్వరి స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఆకస్మికంగా రికార్డుల తనిఖీ నిర్వహించారు. అవినీతిపై ఫిర్యాదు చేసిన నంజప్ప అనే వ్యక్తితో కార్యాలయంలో వివరాలు సేకరించారు. వ్యవసాయ భూమిని రిజిస్టర్ చేసేందుకు మడకశిర సబ్ రిజిస్టర్ శిరీష రూ. 50 వేలు లంచం అడిగినందుకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని బాధితుడు నంజప్ప తెలిపాడు. బాధితుని ఆరోపణలపై సేకరించిన పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు పంపి తదుపరి ఆదేశాలతో చర్యలు చేపడతామని జిల్లా రిజిస్టర్ తెలిపారు.

ఇదీ చదవండి: CHEATING CASE: జగతి పబ్లికేషన్స్‌ పేరిట యువకులకు టోకరా

Last Updated : Nov 9, 2021, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.