కడుపు నొప్పి తాళలేక ఓ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలంలో జరిగింది. సి.రంగిపాలేనికి చెందిన అఖిల్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. శనివారం కూడా నొప్పి రావడంతో తట్టుకోలేక... ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఇదీ చదవండి; మహిళపై అత్యాచార ఘటనలో నిందితుడు ఆత్మహత్య