ETV Bharat / state

తల్లి, చెల్లి మరణించారన్న బాధను దిగమింగుతూ.. - ayusha attend exam when the the death of mother and sister

నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి, తోడబుట్టిన చెల్లి చనిపోయారన్న బాధ ఓ వైపు.. తల్లి లక్ష్యాన్ని నెరవేర్చాలన్న తపన మరోవైపు. తల్లి ఆశయం.. ఆ విద్యార్థిని పరీక్షా కేంద్రం వైపు నడిపించింది. ఇంటర్మీడియట్​ విద్యార్థిని ఆయిషా.. బరువెక్కిన గుండెతో పరీక్షకు హాజరైంది. ఈ విషాద ఘటన గంటూరు జిల్లా తెనాలిలో జరిగింది.

బరువెక్కిన గుండెతో పరీక్ష రాసి ఆయిషా
బరువెక్కిన గుండెతో పరీక్ష రాసి ఆయిషా
author img

By

Published : Sep 16, 2021, 7:31 AM IST

తల్లి, చెల్లి చనిపోయారన్న బాధ ఓవైపు.. తల్లి ఆశయాలను సాధించాలన్న తలంపు మరో వైపు. తల్లి ఆశయ సాధన కోసం.. వారి మరణాన్ని దిగమింగుకుంటూ పరీక్షకు హాజరైంది ఆయిషా. గుంటూరు జిల్లా తెనాలి మార్కట్​ యార్డ్​ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో షేక్ హసీనా సుల్తానా, ఆమె చిన్న కుమార్తె ఇద్దరూ మరణించారు. పెద్ద కుమార్తె ఆయిషా ఇంటర్ చదువుతోంది. తల్లి, చెల్లి మరణించారన్న బాధను దిగమింగుతూ... ఆయిషా బుధవారం ఇంటర్ బెటర్ మెంట్ పరీక్ష రాసింది. తనను డాక్టర్​గా చూడాలన్న తల్లి ఆశయాన్ని నెరవేర్చడానికే పరీక్షకు హాజరైనట్లు ఆయిషా చెప్పింది.

సంబంధిత కథనం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.