ETV Bharat / state

మరికొన్ని గంటల్లో పెళ్లి.. గుండెపోటుతో వరుడు మృతి - bride in adilabad

A person died of a heart attack: కొన్ని గంటలు ఉంటే పెళ్లికుమారుడిగా ముస్తాబవ్వాలి. బంధువులు, స్నేహితులు అందరూ వచ్చేశారు. ఇంతలోనే విధి వక్రించింది. వరుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్​ జిల్లాలో జరిగింది.

heart attack
గుండెపోటు
author img

By

Published : Jan 26, 2023, 8:23 PM IST

A person died of a heart attack: మరికొన్ని గంటల్లో ఆనందోత్సాహాల మధ్య వివాహం జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. మరికొద్ది క్షణాల్లో పెళ్లి కుమారుడు కావల్సిన యువకుడు విగతజీవిగా మారాడు. కుమారుడి పెళ్లి చూడాలన్న ఆ తల్లిదండ్రులు చనిపోయిన కొడుకుని చూసి బోరుమన్నారు. గుండెపోటుతో యువకుడు మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని గుండెకోతను మిగిల్చింది. తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.

పట్టణంలోని రావుల శంకరయ్య చారి, భూలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు రావుల సత్యనారాయణాచారి(34)కి జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన యువతితో శుక్రవారం వివాహం జరగాల్సి ఉంది. బుధవారం అర్ధరాత్రి వరకు కుటుంబసభ్యులతో కలిసి పెళ్లి వేడుకల ఏర్పాట్లలో నిమగ్నమైన సత్యనారాయణాచారి.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడిని ఉట్నూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం సత్యనారాయణాచారి మృతిచెందాడు. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో వరుడి మృత్యువాతతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.