గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం జాలాది గ్రామానికి చెందిన గోపతోటి సురేష్ అనే యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కారుచోల-జగ్గాపురం మార్గంలో ఉన్న డంపింగ్ యార్డుకు సమీపంలో ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ రాంబాబు మృతదేహాన్ని పరిశీలించి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కుటుంబ గొడవలుగా అనుమానం..
కుటుంబ కలహాల నేపథ్యంలోనే గోపి బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారం రోజుల క్రితం గోపి తల్లి కరోనాతో మృతి చెందింది. కొద్ది రోజుల్లోనే కుమారుడు సైతం తనువు చాలించడంతో బాధిత కుటుంబీకులు, బంధువుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చూడండి.