LORRY FIRE ACCIDENT: గుంటూరు శివారులోని నల్లపాడు రోడ్డులో వెళ్తున్న లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. లారీలో ఒక్కసారిగా మంటలు రావటంతో అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్ హుటాహుటిన లారీ నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. అప్పటికే లారీ సగానికి పైగా కాలిపోయింది. ప్రమాద ఘటనపై అగ్నిమాపక సిబ్బంది ఆరా తీస్తున్నారు.
ఇవీ చదవండి: