గుంటూరు జిల్లా నరసరావుపేటలో సినీ నటి కాజల్ అగర్వాల్ సందడి చేశారు. పట్టణంలోని కోట సెంటర్లో ఏర్పాటు చేసిన స్వాతి షాపింగ్ మాల్ అనే ఓ వస్త్ర దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. నరసరావుపేట రావడం చాలా ఆనందంగా ఉందని కాజల్ తెలిపారు. గతంలో ఈ సంస్థకు చెందిన రెండు దుకాణాలను చీరాల, గుంటూరు పట్టణంలో తనే ప్రారంభించానని చెప్పారు. కొనుగోలుదారులకు స్వాతి సంస్థ అనేక రకాల ఆఫర్లను ఇస్తోందన్నారు. జిల్లా ప్రజల అభిమానం తనకెప్పుడూ సంతోషాన్నిస్తుందన్నారు. ఈ ముద్దుగుమ్మను చూసేందుకు పట్టణానికి చెందిన ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి తొక్కిసలాట జరగకుండా ఒకటో పట్టణ పోలీసులు పర్యవేక్షించారు.
ఇదీ చదవండీ: