ప్రకాశం జిల్లాలో మత్స్యకార గ్రామాల మధ్య వివాదం మరువక ముందే గుంటూరు జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. కొల్లూరు మండలంలోని గాజుల్లంక మత్స్యకారులను పోతర్లంక వారు అడ్డుకున్నారు. నిషేధిత ఐలా వలలతో గాజుల్లంక మత్స్యకారులు చేపల వేట సాగిస్తున్నారని పోతర్లంక గ్రామస్థులు ఆరోపించారు. ఈ విషయం పై కృష్ణా నదిలో బోట్లు అడ్డుగా పెట్టి చేపల వేట అడ్డగించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.
ఇదీ చదవండీ...పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అథారిటీ బృందం