గుంటూరు జిల్లా ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో 9 నెలల బాలుడికి క్షయ లక్షణాలు బయటపడ్డాయి. చర్మంలో ఈ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సంబంధిత చికిత్స అందిస్తున్నారు. రెంటచింతల గ్రామానికి చెందిన దంపతుల కుమారుడు సిద్ధార్థ వయసు ప్రస్తుతం 9 నెలలు. నెల క్రితం అతని శరీరంలోని ఓ భాగంలో కురుపు ఏర్పడి చీము రాసాగింది. పలు ఆస్పత్రుల్లో చికిత్స అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించారు. అన్ని పరీక్షలు నిర్వహించి చీము గడ్డను తొలగించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.
ఇదీ చదవండి: