జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుంటూరు పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. 6 పార్లమెంట్, 35 అసెంబ్లీ నియోజకవర్గాలుకు ఇంచార్జ్‌లను నియమించారు.
పార్లమెంట్ స్థానాలకు ఇన్చార్జ్ లుగా ఎన్నికైన నేతలు
పార్లమెంట్ స్థానాలు | అభ్యర్థిపేరు |
విశాఖ | లక్ష్మినారాయణ |
కాకినాడ | పంతం నానాజీ |
అమలాపురం | డీఎంఆర్ శేఖర్ |
రాజమండ్రి | కందుల దుర్గేష్ |
గుంటూరు | బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ |
అరకు | పి.గంగులయ్య |
అలాగే 35 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇంఛార్జిలుగా అవకాశం దక్కించుకున్నవారిలో ఎక్కువమంది గత ఎన్నికల్లో పోటీ చేసిన వారే కావటం గమనార్హం. జనసేన పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను రాజోలు ఇంఛార్జిగా నియమించారు. ఇక ఉత్తరాంద్ర జిల్లాల సమన్యయానికి ఐదుగురు సభ్యులతో కమిటిని నియమించారు. ఈ కమిటిలో టి.శివశంకర్, మేడా గురుదత్, సుజాత పండా, బొమ్మిడి నాయకర్, వై.శ్రీనివాస్ సభ్యులుగా ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం గ్రామీణ ప్రాంతంలో పార్టీ కార్యక్రమాలను ఈ కమిటీ సమన్వయం చేయనుంది.
ఇదీ చూడండి