AP Corona Cases Today: రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 35,040 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 5,983 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి.. 11 మంది మృతి చెందారు. కొవిడ్ నుంచి కొత్తగా 11,280 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,00,622 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించిది.
Covid cases in India: మరోవైపు భారత్‌లో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 1,61,386 కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. 1,733 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. 2,81,109 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 9.2 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు ప్రస్తుతం 4.20 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 94.60 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం మరణాలు: 4,97,975
- యాక్టివ్ కేసులు: 16,21,603
- మొత్తం కోలుకున్నవారు: 3,95,11,307
Covid Tests:
మంగళవారం.. దేశవ్యాప్తంగా 17 లక్షల 42 వేల 793 కరోనా పరీక్షలు చేశారు. మొత్తం టెస్ట్‌ల సంఖ్య 73 కోట్ల 24 లక్షలను దాటింది.
World Corona cases
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 28,63,792 మందికి కరోనా సోకింది. 11,168 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 38,17,96,932 కు చేరగా.. మరణాల సంఖ్య 57,04,155 కు పెరిగింది.
- ఫ్రాన్స్‌లో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 4,16,896 వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. మరో 381 మంది చనిపోయారు.
- US Corona Cases: అమెరికాలో కొత్తగా 2,64,693 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. 2,780 మంది మరణించారు.
- ఇటలీలో 1.33 లక్షల కొత్త కేసులు బయటపడగా.. 339 మంది మరణించారు.
- బ్రెజిల్లో కొత్తగా 1,71,616 మందికి వైరస్ సోకగా.. 767 మంది చనిపోయారు.
- అర్జెంటీనాలో తాజాగా 43 వేలకుపైగా కరోనా కేసులు బయటపడగా.. 285 మంది బలయ్యారు.
- జర్మనీలో ఒక్కరోజే దాదాపు 1,83,434 మందికి వైరస్ సోకింది. మరో 182 మంది మృతి చెందారు.
ఇదీ చదవండి:
CM Review: ఉద్యోగులకు మంచి జరగాలని సర్వీసు పెంచాం: సీఎం జగన్