దిల్లీ మద్యం స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. మనీలాండరింగ్ అంశంలో శరత్‌చంద్రారెడ్డి, బినోయ్ బాబుకు 14 రోజుల కస్టడీనిచ్చింది ధర్మాసనం. ఈడీ అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది. జైలులో బినోయ్ బాబు, శరత్ చంద్రారెడ్డిలకు ఇంటి భోజనానికి కోర్టు అనుమతించింది. బీపీ మందులు, చలి దుస్తులు, బూట్లు వాడేందుకు కోర్టు అనుమతినివ్వగా... జైలులో ఇద్దరికీ చికిత్స అందించాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు ఇక తదుపరి విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది. నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ ఈ నెల 24కి వాయిదా పడింది.
శరత్‌చంద్రారెడ్డిని కలిసిన చెవిరెడ్డి: మద్యం కుంభకోణం కేసు నిందితుడు శరత్ చంద్రారెడ్డిని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కలిశారు. రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ తర్వాత.. శరత్ చంద్రారెడ్డిని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కలిశారు.
ఇవీ చదవండి :