ETV Bharat / state

మంగళగిరి మద్యం దుకాణంలో చోరీ..1200 బాటిళ్లు ఎత్తుకెళ్లిన దొంగ - robbery at mangalagiri wine shop

మంగళగిరి ప్రభుత్వం మద్యం దుకాణంలో 1200 మద్యం సీసాలను ఓ యువకుడు ఎత్తుకెళ్లాడు. విషయం తెలుసుకున్న క్లూస్​ టీం సభ్యులు ఘటనా స్థలంలో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఇదే తరహా దోపిడీ కొల్లిపర, అమరావతిలో జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

1200 bottles robbed by a person in mangalagiri wine shop
సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించిన క్లూస్​ టీం
author img

By

Published : Jul 6, 2020, 11:37 AM IST

గుంటూరు జిల్లా మంగళగిరి ప్రభుత్వ మద్యం దుకాణంలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. దుకాణం కిటికీ పగలగొట్టి లోనికి వెళ్లిన దొంగ 1200 మద్యం సీసాలను ఎత్తుకెళ్లాడు. సమచారం అందుకున్న క్లూస్​ టీం సభ్యులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుకాణంలో ఉన్న సీసీ ఫుటేజీ చూశారు. 20 ఏళ్ల యువకుడు ముసుగు ధరించి, ముఖానికి మాస్క్​ వేసుకుని, చేతులకు గ్లౌజ్​లతో లోపలికి వచ్చినట్లు గుర్తించారు. జిల్లాలో కొల్లిపర, అమరావతిలోనూ ఇదే తరహాలో దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. చోరీకు గురైన మద్యం విలువ రూ. 2.36 లక్షలు అపహరణకు గురైనట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి :

సిబ్బంది దందా: ప్రభుత్వ దుకాణాల నుంచి నల్ల బజారుకు మద్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.