ETV Bharat / state

108 Ambulances: సీఎం వస్తేనే అంబులెన్సులు కదులుతాయంట.. ఆసుపత్రి వద్దనే 146 వాహనాలు

author img

By

Published : Jun 24, 2023, 9:12 AM IST

108 ambulances Ambulances in AP: అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రులకు చేర్చే 108 వాహనాల విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది . కొనుగోలు చేసే ప్రక్రియ నుంచి జిల్లాలకు పంపే వరకు నిర్లక్ష్యం వహిస్తుంది. కొనుగోలు చేసి పంపిణీకి సిద్ధంగా 108 అంబులెన్స్ .. ప్రారంభోత్సవానికి నోచుకోవటం లేదు. ప్రస్తుతం మంగళగిరిలోని ఓ ఆసుపత్రి ఆవరణలో 146 వాహనాలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉన్నాయి.

108 Ambulances
సీఎం వస్తేనే అంబులెన్సులు కదులుతాయంట.. ఆసుపత్రి వద్దనే 146 వాహనాలు

108 ambulances Ambulances in AP: రోడ్డు ప్రమాదాలు, ఇతరత్రా కారణాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని సకాలంలో ఆసుపత్రులకు చేర్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. అత్యఅవసరమైన 108 అంబులెన్సులను కొనుగోలు చేయడంలో నిన్నటివరకు తాత్సారం చేసింది. అతికష్టంపై వాటిని సమకూర్చుకున్నా.. సిద్ధంగా ఉన్న వాటిని అందుబాటులోకి తెచ్చే విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ ఏడాది జనవరి 25న పిలిచిన టెండరు ప్రకారం ఎల్‌1గా వచ్చిన సంస్థ దశల వారీగా 146 వాహనాలను పంపగా.. వాటిని మంగళగిరిలో వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం సమీపంలోని ఓ ప్రముఖ ఆసుపత్రి ఆవరణలో ఉంచారు. ఆరోగ్య శాఖ మంత్రి ద్వారా వాహనాలను జిల్లాలకు పంపించాలని ఏర్పాట్లు చేశారు. సీఎం చేతుల మీదుగా వాటిని ప్రారంభించాలని చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుని తలపెట్టిన కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రులకు చేర్చే 108 వాహనాల విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. కొనుగోలు చేసే ప్రక్రియ నుంచి జిల్లాలకు పంపే వరకు నిర్లక్ష్యం వహిస్తుంది. మే మొదటి వారంలోనే అవి అక్కడికి చేరుకోగా.. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ, పరికరాలు అమర్చడంలో మరింత జాప్యమైంది. ప్రధానంగా అంబులెన్సుల్లోని పరికరాలను వాహనంతోపాటు కొనుగోలు చేయాలని ఒకసారి, విడిగా కొనాలని మరోసారి నిర్ణయించడంతో విపరీతమైన జాప్యం జరిగింది. శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ద్వారా ఈ వాహనాలను జిల్లాలకు పంపించే విధంగా ఏర్పాట్లు చేశారు. జిల్లాల నుంచి అంబులెన్స్‌ల డ్రైవర్లను కూడా రప్పించారు. ముఖ్యమంత్రి జగన్‌ ద్వారా వీటిని ప్రారంభింపచేయాలన్న ఉద్దేశంతో చివరి నిమిషంలో తలపెట్టిన కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు సమాచారం.

ప్రస్తుతం జిల్లాల్లో నడుస్తున్న అంబులెన్సులు తరచూ మరమ్మతులకు గురవుతుండడంతో క్షతగాత్రులు ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజుల కిందట కృష్ణా జిల్లా కోడూరు మండలం పిట్టలంక గ్రామంలో ఎండవేడికి స్పృహ తప్పిన వృద్ధురాలిని అవనిగడ్డ ఆసుపత్రికి తరలిస్తున్న 108 అంబులెన్స్‌ రహదారిపై గుంతల కారణంగా చాలాసేపు నిలిచిపోయింది. మన్యం మండలాల్లో 108 అంబులెన్సులు సకాలంలో బాధితుల వద్దకు చేరడం లేదు. ఇటీవల బుట్టాయగూడెం సమీపంలోని రౌతుగూడెం వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు 108కు ఫోన్‌ చేయగా.. గంట తర్వాత ప్రైవేట్ వాహనంలో వెళ్లాలన్న సమాధానం వచ్చింది. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో నిత్యకృత్యంగా మారాయి.

ఈ పరిస్థితుల్లో యుద్ధప్రాతిపదికన కొత్త వాహనాలు కొనుగోలు చేసి, రోడ్లపై తిరిగేలా చేయాల్సిన ప్రభుత్వం ప్రతి విషయంలోనూ తాత్సారం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 768 అంబులెన్సులు నడుస్తుండగా వాటిలో 336 పాత వాహనాలు ఉన్నాయి. వీటిలో 250 వాహనాల సామర్థ్యం ఘోరంగా ఉంది. రోడ్డు ప్రమాదం జరిగిన గంటలోపు చికిత్స అందిస్తే క్షతగాత్రులకు ప్రాణాపాయ ముప్పు తగ్గుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే 108 అంబులెన్సులు సంఘటన స్థలానికి పట్టణ ప్రాంతాల్లో 15 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాలైతే 20 నిమిషాలు, గిరిజన ప్రాంతాలకు 30 నిమిషాల్లో చేరుకోవాలనే నిబంధన విధించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.