ETV Bharat / state

నేడే ఏపీ సర్కారు తాత్కాలిక బడ్జెట్ - ఏపీ సర్కారు తాత్కాలిక బడ్జెట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు ఉదయం మంత్రిమండలి సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు.

author img

By

Published : Feb 5, 2019, 5:24 AM IST

నేడే ఏపీ సర్కారు తాత్కాలిక బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్​ను ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు నేడు శాసన సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఉదయం 11.45 నిమిషాలకు జరిగే మంత్రి మండలి సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నారు. ఆ తర్వాత ఉభయ సభలకు సమర్పిస్తారు. ప్రస్తుత బడ్జెట్ విలువ దాదాపు 2.25 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
undefined
సామాజిక సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, వ్యవసాయం, సాగునీటి రంగాలకు ప్రాధాన్యత కల్పిస్తూ, విద్యార్థుల నుంచి వివిధ ఫెడరేషన్ల వరకు అందరినీ సంతృప్తి పరిచేలా ఈ బడ్జెట్ రూపొందించినట్లు సమాచారం. "ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యం" అనే నినాదంతో 2019-2020 ఓటాన్ అకౌంట్ బడ్జెట్​ను రాష్ట్ర సర్కారు రూపొందించింది. ఎన్నికల వేళ భారీ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
గత ఏడాది కన్నా ఈసారి రెవెన్యూ వ్యయం మరింత ఎక్కువగా ఉంటుందనే సంకేతాలు వస్తున్నాయి. సవరణ బడ్జెట్​ను కూడా ఎక్కువగా చూపించేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నెల చివరిలోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నందున వివిధ వర్గాలకు భారీ నజరానాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. యువత, రైతు, మహిళలకు భారీగా కేటాయింపులు చేయనున్నారు. ప్రధానంగా రైతుకు ఏటా "అన్నదాత సుఖీభవ సాయం" పేరిట ఎకరాకు 10 వేల రూపాయల వరకు ఇవ్వాలనే ఆలోచనను బడ్జెట్లో ప్రతిపాదించే అవకాశాలు వున్నాయి. ఇదే సమయంలో ఓటర్లను ఆకర్షించే పథకాలను కూడా చూపనున్నట్లు తెలుస్తుంది.
ఐదేళ్ల తర్వాత రెట్టింపు బడ్డెట్...
గత ఏడాది 1.94 లక్షల కోట్లు రూపాయలతో రాష్ట్ర బడ్డెట్​ను ప్రతిపాదించగా... ఈసారి మరో పాతిక నుంచి 30 వేల కోట్లను అదనంగా ప్రతిపాదించే అవకాశాలు వున్నాయి. ఈ మొత్తంలో సంక్షేమ పథకాలకు ఎక్కువ నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో నీటిపారుదల రంగానికి, సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమ, వ్యవసాయం, యువజన సంక్షేమం వంటి వాటికి ఎక్కువ నిధులు కేటాయింపులో ఉంటాయని తెలుస్తుంది. రాష్ట్ర పునర్ విభజన తర్వాత 2014 -15 సంవత్సరంలో 1 .11 లక్షల కోట్ల మేర బడ్జెట్ ప్రతిపాదించగా...సరిగ్గా 5 ఏళ్ళ తరువాత ఇది రెట్టింపు కానుంది.
ఎన్నికల ముందు సమర్పిస్తున్న బడ్జెట్ కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పటంతో పాటు రాష్ట్ర వనరులు పెంచుకున్న తీరును వివరించనున్నారు.
ప్రతి సంవత్సరం రాష్ట్ర వార్షిక బడ్జెట్​తో పాటు వ్యవసాయ బడ్జెట్​ను ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రవేశ పెడుతూ వస్తోంది. ఈ సారి కేవలం 4 నెలలకు అనుమతి కోరే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే కాబట్టి, వ్యవసాయ బడ్జెట్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం లేదు. జలవనరుల శాఖకు గత ఆర్థిక సంవత్సరం లో 16వేల 978 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశ పెట్టగా... ఈ సారి 20 వేల కోట్ల రూపాయలకు పైగా సవరించారు. 45 వేల కోట్ల రూపాయలకు పైగా ప్రతిపాదనలు రాగా దాదాపు 28 వేల కోట్ల రూపాయల వరకు కేటాయింపులు ఉంటుందని తెలుస్తుంది. జై హో బీసీ సభలో వివిధ కార్పొరేషన్ల ఏర్పాటుకు సీఎం ప్రకటించటంతో వాటికీ కొత్తగా నిధులు కేటాయింపు చేయనున్నట్లు సమాచారం.
ఇంత భారీ బడ్జెట్ లో ఆదాయ మార్గాలు ఎలా చూపుతారని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Bijnor (Uttar Pradesh), Feb 04 (ANI): Sugarcane farmers staged protest over pending dues in Uttar Pradesh's Bijnor district today. Police baton charged sugarcane farmers led by Azad Kisan Union which is protesting outside Collector office in Bijnor alleging non-payment of dues. The farmers have been staging protest at Chandpur tehsil in Bijnor for the last one month over pending dues of around Rs 62 crore owed by two sugar mills-PBS Food Limited, Chandpur, and Wave Sugar Industry in the district.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.