ETV Bharat / state

చిన్నారి కిడ్నాప్​న​కు మహిళ యత్నం.. పట్టుకున్న ఆస్పత్రి సిబ్బంది

Child Kidnapping in Eluru Govt Hospital: Kidnapping: ఆసుపత్రిలో ఓ తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి.. పసిపాపను కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. హాస్పిటల్ ఆవరణలో చంటి బిడ్డతో అనుమానాస్పదంగా తిరుగుతుండటంగా.. సిబ్బంది ఆమెని నిలదీయడంతో అసలు విషయం తెలుసుకుని.. ఆమెను పోలీసులకు అప్పగించారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Nov 13, 2022, 6:07 PM IST

Updated : Nov 13, 2022, 9:03 PM IST

Child Kidnapping in Eluru Govt Hospital: ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. కామవరపు కోటకు చెందిన ఓ మహిళ ఈ నెల 2న ఆస్పత్రిలో ఓ పాపకు జన్మనిచ్చింది. గుర్తుతెలియని ఓ మహిళ ఆ పాపను తీసుకొని బాక్సులో పెట్టాలంటూ.. తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి అక్కడనుంచి తీసుకెళ్లింది. హాస్పిటల్ ఆవరణలో చంటి బిడ్డతో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో.. సిబ్బంది ఆమెను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. పాపతో తనకు సంబంధం లేదంటూ ఆమె బుకాయించడంతో.. సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో.. ఆమెను పోలీస్ స్టేషన్​కు తరలించారు. అపహరణకు గురైన పాపను తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 13, 2022, 9:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.