ETV Bharat / state

నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని అదృశ్యం..ప్రశ్నార్థకంగా భద్రతా వ్యవస్థ - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

SECURITY LAPSES IN NUZVID IIIT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో భద్రతా వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారింది. విద్య, సృజనాత్మకత, ఉద్యోగ అవకాశాల్లో రాష్ట్రంలోని మిగిలిన ట్రిపుల్ ఐటీలతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నా భద్రతా లోపాలు మాత్రం కొట్టొచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని క్యాంపస్ నుంచి అదృశ్యమయ్యి హైదరాబాద్​లో ప్రత్యక్షం కావడం భద్రతా వ్యవస్థ డొల్ల తనాన్ని బయటపెట్టింది.

నూజివీడు ట్రిపుల్ ఐటీలో భద్రతా వ్యవస్థ
SECURITY LAPSES IN NUZVID IIIT
author img

By

Published : Dec 31, 2022, 2:50 PM IST

SECURITY LAPSES IN NUZVID IIIT: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో సుమారు 8 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. నూజివీడు క్యాంపస్‌కు సంబంధించి సుమారు 6,600 మంది, శ్రీకాకుళం క్యాంపస్‌కు చెందిన 2,200 మంది విద్యార్థులు ఉన్నారు. వేల మంది విద్యార్థులు వీరితో పాటు పెద్దఎత్తున బోధనా సిబ్బంది ఉన్నా క్యాంపస్‌లో భద్రతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని క్యాంపస్ నుంచి అదృశ్యం కావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రిపుల్ ఐటీ ప్రారంభించి 14 ఏళ్లు గడిచినా ఇప్పటికీ సరైన సౌకర్యాలు లేవు. మూడు వైపులా ప్రహరీ ఉండగా మరోవైపున కేవలం కంచె మాత్రమే వేశారు. కేవలం 169 మంది సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.

నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని క్యాంపస్ నుంచి అదృశ్యం కావడంపై విమర్శలు

గుర్తింపు కార్డుల విషయంలో భద్రతా లోపాలు:
విద్యార్థిని అదృశ్యం కేసు విచారణ వేళ క్యాంపస్​లో భద్రతా లోపాలు బయటపడ్డాయి. అదృశ్యమైన విద్యార్థిని తన స్నేహితుడిని అన్న అని చెప్పి క్యాంపస్​లోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం తల్లిదండ్రులకిచ్చే గుర్తింపు కార్డునూ మార్పేసినట్లు అధికారులు చెబుతున్నారు. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి అతనితో కలిసి క్యాంపస్ దాటి హైదరాబాద్ చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇకపై గుర్తింపు కార్డుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు విద్యార్థుల పర్యవేక్షణకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక పోతున్నారనే విమర్శలూ నూజివీడు ట్రిపుల్ ఐటీపై వస్తున్నాయి.

ఇవీ చదవండీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.