TDP EX MLA JAYA MANGALA PARTY CHANGE RUMORS : తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, కైకలూరు నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్ జయ మంగళ వెంకటరమణ పార్టీ మారుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. మాజీ ఎమ్మెల్యేగా ఉన్న జయమంగళకు.. ప్రభుత్వం రాత్రికి రాత్రే నలుగురు గన్మెన్లను ఏర్పాటు చేయడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన జయ మంగళ.. 2014 లో బీజేపీతో పొత్తులో భాగంగా కైకలూరు సీటును కామినేని శ్రీనివాసరావుకు కేటాయించడంతో అప్పట్లో ఆయన విజయం కోసం జయ మంగళ పనిచేశారు.
2019లో మరోసారి టీడీపీ నుంచి పోటీ చేసిన జయ మంగళ.. దూలం నాగేశ్వరరావుపై ఓడిపోయారు. ఓడిపోయినా.. పార్టీ ఆదేశానుసారం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కైకలూరు వచ్చిన జగన్మోహన్ రెడ్డి.. కొల్లేరు ప్రాంతానికి ఎమ్మెల్సీ సీటు ఇస్తానని హామీ ఇవ్వడం.. అది జయ మంగళకే అంటూ ప్రస్తుతం పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అటు అధికార పార్టీ నుంచి కానీ ఇటు జయ మంగళ వెంకటరమణ నుంచి కానీ ఎలాంటి స్పష్టత రాలేదు.
రాత్రి నుంచి జయ మంగళ వెంకటరమణ కార్యకర్తలకు సైతం అందుబాటులో లేకపోవడం.. పార్టీ మార్పు ఊహగానాలకు తావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో జయ మంగళ వైఎస్సార్సీపీ వైపే మొగ్గు చూపుతున్నట్లు ఆయన సన్నిహితుల నుంచి సమాచారం.
ఇవీ చదవండి: