ETV Bharat / state

ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం.. - పోలవరం అథారిటీ సమావేశం

Polavaram Project: హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం ప్రారంభమైంది. సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల పలువురు అధికారులు హాజరుకానున్నారు.

పోలవరం ప్రాజెక్టు అథారిటీ
Polavaram Project
author img

By

Published : Nov 16, 2022, 9:10 AM IST

Updated : Nov 16, 2022, 12:34 PM IST

Polavaram Project Authority: హైదరాబాద్​లో కృష్ణా గోదావరి భవన్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వం వహించనున్నారు. ఈ సమావేశానికి ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి, రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు, ఇంజినీర్లు, కేంద్ర జలసంఘం ప్రతినిధులు హాజరయ్యారు.

హైదరాబాద్‌లో ఉన్న పీపీఏ కార్యాలయాన్ని రాజమహేంద్రవరం తరలించాలని ఆంధ్రప్రదేశ్‌ కోరుతున్న అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పొలవరం బ్యాక్ వాటర్స్ కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముంపు ఏర్పడుతోందని.. ఆ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయాలని.. తెలంగాణ కోరనుంది.

ముంపు సమస్యలపై నిపుణుల కమిటీ ప్రాథమిక నివేదిక కూడా ఇచ్చింది. 827 ఎకరాల వరకు ముంపునకు గురవుతోందని, ఆ మేరకు పీపీఏ ద్వారా భూసేకరణ చేయాలని.. సూచించింది. ఇటీవల రెండు రాష్ట్రాల ఆధ్వర్యంలో ఉమ్మడి సర్వే నిర్వహించారు. ఈ అంశంపైనా నేడు చర్చ జరగనుంది.

ఇవీ చదవండి:

Last Updated : Nov 16, 2022, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.