ETV Bharat / state

సాధ్యమైనంత త్వరలో పోలవరం పూర్తి చేసి నీళ్లందిస్తాం: మంత్రి అంబటి - పోలవరం న్యూస్

డయాఫ్రమ్ వాల్ దెబ్బతినటం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గత ప్రభుత్వం తప్పిదాల కారణంగా రూ.16,000 కోట్లు ఉన్న ప్రాజెక్టు వ్యయం నేడు రూ.47,000 కోట్లకు చేరిందన్నారు. సాధ్యమైనంత త్వరలో ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని చెప్పారు.

సాధ్యమైనంత త్వరలో పోలవరం పూర్తి చేసి నీళ్లందిస్తాం

author img

By

Published : May 5, 2022, 10:09 PM IST

సాధ్యమైనంత త్వరలో పోలవరం పూర్తి చేసి నీళ్లందిస్తాం

పోలవరంలో గత వరదలకు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పునరుద్ధరణపై.. జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు అధికారులతో చర్చించారు. పోలవరం ప్రాజెక్టును.. మంత్రిగా తొలిసారి సందర్శించిన రాంబాబు కుడి ప్రధాన కాలువ జంట గుహలు, హెడ్ రెగ్యులేటర్, స్పిల్ వే, ఫిష్ ల్యాడర్, పవర్ హౌస్, దిగువ కాపర్ డ్యామ్ పనులను పరిశీలించారు. తూర్పు గోదావరి జిల్లా వైపుఉన్న ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం, డయాఫ్రం వాల్ దెబ్బతిన్న ప్రాంతాలనూ సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. గత ప్రభుత్వంలో.. డయాఫ్రమ్ వాల్ పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ లు నిర్మించించడం వల్లే నష్టం జరిగిందని అంబటి చెప్పారు. డయాఫ్రం వాల్ కొత్తది కట్టాలా? లేదంటే పునర్నిర్మించాలా..? అనేదానిపై కొన్ని రోజుల్లో పూర్తి ప్రణాళిక సిద్ధం అవుతుందన్నారు. ఆ తర్వాతే ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో స్పష్టత వస్తుందని చెప్పారు.

"డయాఫ్రమ్ వాల్ దెబ్బతినటం వల్లే ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైంది. సాధ్యమైనంత త్వరలో ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. మా ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి నీళ్లు అందిస్తాం. డయాఫ్రం వాల్ పునరుద్ధరణకు మూడు అంశాలను పరిశీలిస్తున్నాం. కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తి కాకుండా డయాఫ్రం వాల్ నిర్మించడం తొందరపాటు చర్య. ఫలితంగా రూ. 400 కోట్లు వృథా అయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడం వల్ల రూ.16,000 కోట్లు ఉన్న ప్రాజెక్టు వ్యయం నేడు రూ.47,000 కోట్లకు చేరింది. అర్​అండ్​ఆర్ కాలనీల పనులను దశలవారీగా పూర్తి చేస్తున్నాం. నిర్వాసితులకు పరిహారం, ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం." -అంబటి రాంబాబు, జలవనరులశాఖ మంత్రి

ఇదీ చదవండి: POLAVARAM: ఆలస్యమనుకుంటే.. మీరే డిజైన్లు ఖరారు చేసుకోండి: డీడీఆర్‌పీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.