Kolleru lands: కొల్లేరులో అక్రమ తవ్వకాలు, నిబంధనలను అతిక్రమిస్తూ చేస్తున్న రొయ్యల సాగుపై.. గురువారం, శుక్రవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాలకు అధికార యంత్రాంగం స్పందించింది. ఏలూరు జిల్లాలోని కొల్లేరు ప్రాంతంలో అటవీశాఖ అధికారులు పర్యటించి అక్రమ తవ్వకాలు చేసిన భూములను పరిశీలిస్తున్నారు. ఏలూరు మండలంలోని పెదయాగనిమిల్లి, పైడిచింతపాడు గ్రామాల పరిధిలో అక్రమ తవ్వకాలను రాజమహేంద్రవరం ఫ్లయింగ్ స్క్వాడ్ రేంజర్ సోమరాజు తమ సిబ్బందితో శుక్రవారం పరిశీలించారు. పరిశీలనలో గుర్తించిన అంశాలను నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: