ETV Bharat / state

పొలంలో బంగారం ‘పండింది’.. ఆయిల్‌పాం తోటలో బంగారు నాణేలు

GOLD COINS IN OIL PALM PLANTATION : ఓ తోటలో పైపులైన్ల కోసం తవ్వుతుండగా ఓ మట్టి పిడత లభ్యమైంది. అందులో బంగారు నాణేలు ఉండటం చూసిన ఆ యజమాని ఆశ్చర్యానికి గురైయ్యారు. ఏలూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

GOLD CIONS
GOLD CIONS
author img

By

Published : Dec 3, 2022, 3:39 PM IST

Updated : Dec 3, 2022, 6:52 PM IST

పొలంలో పురాతన బంగారు నాణేలు లభ్యం

GOLD CIONS: ఆయిల్‌పాం తోటలో తవ్వుతుండగా పురాతన కాలానికి చెందిన 18 బంగారు నాణేలు దొరికిన ఘటన ఏలూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెం గ్రామ పరిధిలో గత నెల 29న ఇవి లభ్యమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ గ్రామంలో మానుకొండ తేజస్వికి చెందిన ఆయిల్‌పాం తోటలో పైపులైన్‌ కోసం తవ్వుతుండగా బంగారు నాణేలున్న మట్టి పిడత దొరికింది. ఆమె భర్త సత్యనారాయణ ఇచ్చిన సమాచారం మేరకు వచ్చిన తహసీల్దారు పి.నాగమణి.. నాణేలతోపాటు వాటిని ఉంచిన మట్టి పిడతను పరిశీలించారు. ఒక్కో నాణెం సుమారు 8 గ్రాములకు పైగా బరువు ఉన్నాయని నిర్ధారించారు. ఇవి రెండు శతాబ్దాల క్రితం నాటివిగా భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 3, 2022, 6:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.