ETV Bharat / state

బయట పిచ్చి మొక్కలు.. లోపల ఉంటే ఎప్పుడు కూలుతుందో తెలియదు..! - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

DEGREE COLLEGE: కళాశాల కాంపౌండ్ నుంచి.. దట్టంగా పిచ్చి మొక్కలు, రాళ్లురప్పలు..! కాస్త లోపలికి వెళ్తే శిథిలావస్థకు చేరిన రేకుల షెడ్డుల్లాంటి..మూడు తరగతి గదులు..! ఆ రేకులకు చిల్లులు ఉండడం వల్ల.. విద్యార్థులను అప్పుడప్పుడూ ఎండావానా పలకరిస్తాయ్..! అంతేనా..ల్యాబుల్లో బూజు పట్టిన అరకొర పరికరాలు, సీసాలు..! ఇక ..ఆ కళాశాలలో కష్టాలు విద్యార్థులకే పరిమితం కాలేదు..! అధ్యాపకులకూ దాదాపు అదే కోటాలో ఇబ్బందులు..! 2008లో ఏర్పాటైన ఓ జిల్లాకేంద్రంలోని డిగ్రీ కళాశాలదీ దుస్థితి.

DEGREE COLLEGE
DEGREE COLLEGE
author img

By

Published : Jul 24, 2022, 12:16 PM IST

DEGREE COLLEGE: ఈ వీడియోలో కనిపించేది.. పాడుబడిన నివాస భవనాలు కాదు. విద్యార్థులు పాఠాలు వినే తరగతి గదులు..! అవును నిజమే..! ఒకటి, రెండేళ్లు కాదు..! దశాబ్దన్నరకుపైగా.. విద్యార్థులకు ఇక్కడే బోధించారు..! తరగతి గదుల్లో పైకప్పునకు చిల్లులతో పుస‌్తకాలపైనో, బోర్డుపైనో సూర్యకిరణాలు ప్రత్యక్షమవుతాయి. ఇక..కాంపౌండ్‌లో చూసేంతదూరం..ఇలా గుబురుగా పెరిగిన గడ్డిమొక్కలే కనిపిస్తాయి..

కళాశాల బయట రాళ్లు, రప్పలు.. లోపల శిథిలావస్థ.. ఇది ఏలూరు ప్రభుత్వ కాలేజీ దుస్థితి

ఏలూరులో ఉన్న ఈ ఏకైక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను.. కోటదిబ్బ ప్రాంతంలోని జూనియర్ కళాశాల ఆవరణలో.. 2008లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ 240 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. దాదాపు పదిహేనేళ్లు కావస్తున్నా.. సొంత భవనాలు, సౌకర్యాల్లేవు. కళాశాల ఆవరణలో ఉన్న పాఠశాల సహా..ఇంటర్మీడియట్‌కు చెందిన రేకు షెడ్లు, ఇతర గదుల్నే వినియోగిస్తున్నారు. ఈమూడు గదుల్లోనే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ విద్యార్థులకు బోధిస్తున్నారు. కొన్ని తరగతులకు చెట్లకిందే బోధన..! తమ ఇబ్బందీ ఇదేనంటున్నారు విద్యార్థులు..! ప్రభుత్వం కళాశాలను అభివృద్ధి చేస్తే సరి..లేకుంటే ప్రైవేటులో చేరేవాళ్లం కదా అని ప్రశ్నిస్తున్నారు.

ఈ కళాశాలలో కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ, జువాలజీ ప్రయోగాలకు ఉన్నది ఒకే ల్యాబ్. రసాయన ప్రయోగాలకు కెమికల్స్..ఫిజిక్స్ టెస్టులకు పరికరాల్లేవని విద్యార్థులు అంటున్నారు. వీటన్నింటికీ సర్దుకున్నా..మరుగుదొడ్లు లేవంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులదీ అదే మాట. కొత్త భవనాలు నిర్మిస్తామంటున్నారు తప్పితే.. ఒక్క అడుగూ ముందుకు పడలేదని చెబుతున్నారు. తమ సంగతి పక్కనబెడితే.. విద్యార్థులకు ఇబ్బందులు ఇలాగే కొనసాగితే..భవిష్యత్తు ఇబ్బందికరమని అంటున్నారు. ఎన్నో ఏళ్లుగా కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి...తమకు కావాల్సిన భవన సముదాయాలు, కనీస సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.