ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి. కొత్త పల్లిలో గంజి ప్రసాద్ హత్య, స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకటరావుపై స్థానికుల దాడి ఈ నేపథ్యంలో ద్వారకాతిరుమల ఎస్సై టీవీ సురేశ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈనెల 30న వైకాపా గ్రామ కమిటీ అధ్యక్షుడు గంజి ప్రసాద్‌ను కత్తులతో అతి కిరాతకంగా నరికి హతమార్చారు. ఇది జరిగిన గంట తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మరో అరగంటలో స్థానిక ఎమ్మెల్యే తలారి ఘటనా స్థలానికి వెళ్లారు. అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న స్థానికులు.. ఎమ్మెల్యేపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో విధి నిర్వహణలో అలసత్వం, శాంతిభద్రతలను పరిరక్షించడంతో విఫలమయ్యారంటూ.. స్థానిక ఎస్సై సురేశ్‌ను సస్పెండ్ చేస్తూ పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే భీమడోలు సీఐ ఎం సుబ్బారావుకు ఛార్జీ మెమో ఇచ్చారు.
ఇదీ చదవండి: పార్కింగ్‌లోని కారులో మృతదేహం.. మూడు రోజులుగా అక్కడే..