Vinayakachavithi: వినాయకచవితి పండగంటేనే వీధివీధినా గణేశా విగ్రహాలు వెలుస్తాయి. చవితి పందిళ్లలో రకరకాల రూపాలు, ఎత్తైన వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. ఈ విగ్రహాలను ఎక్కువగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసేవే. అయితే ఎత్తైన విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తోనే తయారు చేయడం సాధ్యమనుకునే స్థాయి నుంచి మట్టితోనూ అందమైన, భారీ విగ్రహాలను తయారు చేయవచ్చని నిరూపిస్తున్నారు పలు ఉత్సవ కమిటీల నిర్వాహకులు. వీటి వల్ల పర్యావరణానికి ఏ మాత్రం ప్రమాదం ఉండదంటున్నారు. ఏలూరు రామకోటి ప్రాంగణంలోని శ్రీగణేశ్ ఉత్సవ కమిటీ, కుండీ సెంటర్లోని హేలాపురి గణేశ్ ఉత్సవ కమిటీలు కొన్నేళ్లుగా మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఏలూరులో భక్తులు, ఉత్సవ కమిటీల సహాయంతో గణపతి నవరాత్రి ఉత్సవాలు చేస్తున్న నిర్వాహకులు.. బంగాల్ నుంచి ప్రత్యేకంగా కళాకారులను తీసుకువచ్చి కావాల్సిన పరిమాణం, ఎత్తు, ఆకృతుల్లో విగ్రహాలు తయారు చేయిస్తున్నారు. ఈ విగ్రహాల్లో పర్యావరణానికి హాని చేసే రసాయనాలు ఏ మాత్రం లేకుండా పూర్తిగా గడ్డి, మట్టి, కర్రలు, పొట్టుతో తయారు చేస్తున్నారు. విగ్రహాలు అందంగా కనిపించేందుకు వాడే రంగులూ హానికరమైనవి కాదని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రకృతి ప్రేమికులతో పాటు ప్రతి ఒక్కరూ పర్యావరణహిత మట్టి విగ్రహాలనే వాడాలని ఉత్సవ కమిటీ నిర్వాహకులు కోరుతున్నారు.
ఇవి చదవండి: